మానవ అక్రమ రవాణా కేసు..మహిళ పై విచారణ..!!
- March 04, 2025
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై మార్చి 11న హై క్రిమినల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఆమె ఒక గృహ కార్మికురాలిని బలవంతంగా ఉద్యోగంలో నియమించి, ఆమె వేతనాలను తీసుకున్నారని, ఆమె దేశం విడిచి వెళ్లకుండా ఆపడానికి పాస్‌పోర్ట్‌ను తన వద్ద ఉంచుకున్నారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ఆ మహిళ సరైన వర్క్ పర్మిట్ లేకుండా కార్మికురాలిని అనేక ఇళ్లలో పని చేయించిందని ఆరోపిస్తూ మానవ అక్రమ రవాణా నిరోధక , ప్రజా నైతిక రక్షణ డైరెక్టరేట్ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. పరిస్థితులు చట్టపరరంగా లేవని, కార్మికురాలు వెళ్ళిపోయే మార్గం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
అధికారులు బాధితురాలిని, సాక్షులను విచారించారు. ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను సేకరించారు. పోలీసు విచారణలో బాధితురాలు చెప్పిన విషయాలు వాస్తవాలని తేలాయి. కేసు పూర్తయిన తర్వాత, ప్రాసిక్యూషన్ దానిని విచారణ కోసం కోర్టు ముందుకు తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







