దుబాయ్‌లో అల్లు అర్జున్ స్నేహితుడు.. సినీ నిర్మాత గుండెపోటుతో మృతి..!!
- March 04, 2025
దుబాయ్: టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ స్నేహితుడు.. సినీ నిర్మాత, నటుడు కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కేదార్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 37 ఏళ్ల కేదార్ ఫిబ్రవరి 25న జుమేరా లేక్స్ టవర్స్ (JLT)లోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడని తెలిపారు. ఆయనకు మూడు సంవత్సరాల చైల్డ్ ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, సోమవారం సాయంత్రం జెబెల్ అలీలోని శ్మశానవాటికలో అతని మృతదేహాన్ని దహనం చేసినట్లు కేదార్ భార్య రేఖ, బావమరిది రాజ్ నల్తం తెలిపారు. కేదార్ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటుతో మరణించారని వారు చెప్పారు.
కేదార్ యూఎస్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అని, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడని తెలిపారు. అనంతరం అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీని, ఒక ఇండియన్ ఫ్రాంచైజ్ రెస్టారెంట్‌ను స్థాపించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇండియాలో అనేక వ్యాపారాలలోకి అడుగుపెట్టాడని రాజ్ తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అతను గమ్ గమ్ గణేశ (2024), ముత్తయ్య (2022) , విజయ్ దేవరకొండతో ఓ సినిమా తీశాడని పేర్కొన్నారు. తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహిత స్నేహితుడిగా కేదార్ సినీ ఇండస్ట్రీలో విస్తృతంగా ప్రసిద్ది చెందాడు. అతను అతని రెండు హాస్పిటాలిటీ వ్యాపారాలలో వ్యాపార భాగస్వామి కూడా ఉన్నారని పేర్కొన్నారు.
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని యూఏఈకి విస్తరించాలని కేదార్ ఆశించినట్లు రాజ్ చెప్పారు. త్వరలోనే అతని చితాభస్మాన్ని ఇండియాలో పవిత్ర నదులలో కలుపునున్నట్లు పేర్కొన్నారు. కేదార్ అంత్యక్రియలకు సంబంధించి సహాయం చేసిన దుబాయ్‌కు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త నసీర్ వతనప్పల్లికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







