సినిమా టికెట్ రూ.200..కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
- March 08, 2025
బెంగళూరు: సినిమా టికెట్ ధరను రూ. 200 గా నిర్ణయించింది కర్నాటక సర్కారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్ లో కీలకంగా ప్రస్తావించారు.సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం సినిమా టికెట్ ధరలను రూ.200గా నిర్ణయించాలను కుంటున్నట్లు చెప్పారు.మల్టీప్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని స్పష్టం చేశారు. సామా న్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ ఫాము సైతం అం దుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.500 కోట్ల బడ్జె్ట్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







