పాకిస్థాన్‌లో రైలు హైజాక్..
- March 11, 2025
పాకిస్తాన్: పాకిస్థాన్ లో కలకలం రేగింది.రైలును హైజాక్ చేశారు. బలూచ్ రెబల్ గ్రూప్ ఈ పని చేసింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 450 మందిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం.అయితే, వంద మంది పాక్ భద్రతా సిబ్బంది తమ అదుపులో ఉన్నారని ప్రకటించింది రెబల్ గ్రూప్. తమపై సైనిక చర్య తీసుకుంటే బందీలను చంపేస్తామంటూ హెచ్చరించింది.
బలూచిస్థాన్ ను దేశంగా ప్రకటించాలని ఎప్పటినుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. అక్కడ అలజడి రేపుతోంది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. మానవ బాంబులను కూడా ప్రయోగించింది. ఈసారి ఏకంగా ట్రైన్ ని హైజాక్ చేయడం సంచనలంగా మారింది.
పక్కా ప్లాన్ తో మష్కఫ్, దాదర్, బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బెలూచ్ మిలిటెంట్లు. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ను గాయపరిచి 450 మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సెలవుపై వెళ్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా సెలవుపై పాకిస్తాన్ లోని పంజాబ్ వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా సమాచారం.
ఈ హైజాక్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. ఈ చర్యని తామే చేసినట్లు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ అదుపులో 100 పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ఉన్నారని, సైనిక చర్య చేపడితే వారిని హతమారుస్తామని హెచ్చరించింది. బెలూచిస్తాన్ గవర్నమెంట్ బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లతో సంప్రదింపులు జరిపేందుకు మార్గాలు అన్వేషిస్తోంది.అయితే, బందీలుగా ఉన్న వారికి ఏం జరిగింది అనేది ఉత్కంఠగా మారింది. వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







