IPL 2025: ఉప్పల్‌లో పరుగుల విధ్వంసమే: హెచ్‌సీఏ జగన్

- March 11, 2025 , by Maagulf
IPL 2025: ఉప్పల్‌లో పరుగుల విధ్వంసమే: హెచ్‌సీఏ జగన్

హైదరాబాద్: హైదరాబాద్‌లో క్రికెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది హెచ్‌సీఏ.. ఉప్పల్ స్టేడియం.ఒకప్పుడు హెచ్‌సీఏ అంటే అంతర్గత కుమ్ములాటలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేది.మరో వైపు ఉప్పల్ స్టేడియం అంటే గాలికి ఊడిపోయిన కెనోపి.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని గ్రౌండ్..పావురాల రెట్టలతో కూడిన సీట్లు దర్శనమిచ్చేవి. కానీ ఇవన్నీ మారిపోయాయి. అధునాతన హంగులతో స్టేడియాన్ని ముస్తాబు చేశారు.

గత ఐపీఎల్‌లో ఉప్పల్ స్టేడియానికి ఉత్తమ పిచ్ అవార్డ్ కూడా లభించింది.దీని వెనుక హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు కృషి ఎంతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌ నేపథ్యంలో ఆయన మాగల్ఫ్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ కోసం స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈసారి ఉప్పల్ మైదానంలో పరుగుల మోత మోగుతుందని, రికార్డ్ స్కోర్లు నమోదవుతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com