100 సంవత్సరాల పురాతన స్థలంలో ఆకట్టుకుంటున్న రిసార్ట్..!!

- March 12, 2025 , by Maagulf
100 సంవత్సరాల పురాతన స్థలంలో ఆకట్టుకుంటున్న రిసార్ట్..!!

యూఏఈ: ఖోర్ఫక్కన్‌లోని 100 సంవత్సరాల పురాతన స్థలంలో నిర్మించబడిన రిసార్ట్‌  నివాసితులతోపాటు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. చారిత్రాత్మక గ్రామమైన నజ్ద్ అల్ మెక్సార్ లోపల ఉన్న ఈ హోటల్.. అదే పేరుతో రిసార్టుగా మార్చింది. పర్వతాలపై ఉన్న సాంప్రదాయ 'కరీన్ ఇళ్ళు'..  తాటి ఆకుల పైకప్పులతో ప్రత్యేకంగా నిర్మించారు. వాచ్ టవర్‌గా దాదాపు మూడు శతాబ్దాల క్రితం పర్వత శిఖరంపై నిర్మించిన అల్ మెక్సర్ కోటకు కాలిబాటలో ప్రయాణించవచ్చు.  

ఈ కోట అల్ రబీ, అల్ అద్వానీ టవర్‌తో పాటు హిందూ మహాసముద్రం గుండా వచ్చే వారిని అడ్డుకోవడంతోపాటు.. ఖోర్ఫక్కన్‌ను రక్షించడానికి ఉపయోగపడుతుంది.  పర్వతం క్రింద ఉన్న విషి రెస్టారెంట్‌లో ఫుడ్ ను ఎంజాయ్ చేయవచ్చు.  అథారిటీ ఫర్ ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంటేషన్ (ముబదారా), షురూక్ మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన ఈ హోటల్ ఒక సంవత్సరం కిందట ప్రారంభించారు.   

చారిత్రక ప్రాముఖ్యత

రఫీసా ఆనకట్ట నిర్మించబడిన వాడి షీ హెడ్ వద్ద నజ్ద్ అల్ మెక్సార్ గ్రామం ఉంది. ఇనుప యుగానికి చెందిన రాతి శిల్పాలు కనుగొనబడిన ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశంలో ఈ వాడి ఉంది. చారిత్రక కథనాల ప్రకారం.. ఇక్కడ ఒక తెగ నివసించేవారు.  వారు సమీపంలోని వాడి సమృద్ధిగా ఉన్న నీటి వనరు సమీపంలో ఉండటంతో వారు 'అల్ ఫలాజ్' నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు.  2019లో సుప్రీం కౌన్సిల్ సభ్యుడు,  షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఖోర్ఫక్కన్‌లోని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను పునరుద్ధరించాలని ఆదేశాన్ని జారీ చేశారు. నజ్ద్ అల్ మెక్సార్ గ్రామంతో పాటు, ఖోర్ ఫక్కన్ కోట, అల్ అద్వానీ టవర్,  ఇతర చారిత్రాత్మక ప్రంతాలను పునరుద్ధరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com