బై నౌ..పే లేటర్ యాప్‌లు అధిక ఖర్చును ప్రోత్సహిస్తాయా?

- March 13, 2025 , by Maagulf
బై నౌ..పే లేటర్ యాప్‌లు అధిక ఖర్చును ప్రోత్సహిస్తాయా?

యూఏఈ: ఇటీవల  బై నౌ..పే లేటర్ సదుపాయాన్ని అందించే యాప్‌ల పెరుగుదల వినియోగదారులు షాపింగ్‌ను పూర్తిగా మార్చివేసింది. వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి, వాయిదాలలో చెల్లించడానికి వీలు కల్పించింది. అయితే, ఈ సౌలభ్యం ఈ సేవలు అధిక ఖర్చును ప్రోత్సహిస్తాయా? వినియోగదారుల ఆర్థిక అలవాట్లపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందా అనే దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను షేర్ చేశారు. 

చాలా బ్యాంకులు వడ్డీ లేని వాయిదాలలో చెల్లించే ఎంపికను అందిసస్తున్నాయి. వీటిని తరచుగా ' బై నౌ..పే లేటర్ ' (BNPL) ప్లాన్‌లు అని పిలుస్తారు. ఇది కస్టమర్‌లు తిరిగి చెల్లించే షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటే, వడ్డీ ఛార్జీలు లేకుండా నిర్ణీత వ్యవధిలో ఖర్చును కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది.

చెవ్రాన్‌లోని మిడ్ చైన్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ బెన్ లెబిగ్ ఈ పెరుగుతున్న ధోరణిపై స్పందించారు. ' బై నౌ..పే లేటర్ యాప్‌లు ' యాప్‌లు యూఏఈలో వివిధ వర్గాలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాని ఆయన అన్నారు. వివిధ నెలల్లో చెల్లింపులు చేయడం ద్వారా అధిక విలువ కలిగిన కొనుగోళ్లను మరింత సరసమైనవిగా మార్చాలనే ఉద్దేశ్యం ఉన్నప్పటికీ, ఈ యాప్‌ల అతి వాడకం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఆర్థిక ప్రభావం వెంటనే కనిపించకపోవడంతో ఈ యాప్‌లు స్పాట్ కొనుగోల్లు చేయడాన్ని ప్రోత్సహించాయని డాక్టర్ బెన్ కూడా పేర్కొన్నారు. గతంలో భాగా ఖరీదైన వస్తువులను ఈ యాప్‌లను ఉపయోగించి వాయిదాల చెల్లింపుతో కొనుగోలు చేసిన చాలా మంది ఇప్పుడు డబ్బు ఖర్చు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. అయితే, ఈ యాప్‌లపై నిరంతరం ఆధారపడటం వల్ల కాలక్రమేణా అప్పులు పేరుకుపోతాయని ఆయన హెచ్చరించారు.    

యూఏఈలోని వినియోగదారులు ఈ సేవలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.  అబుదాబికి చెందిన అబ్దుల్లా కరామా అల్ జుబైది ఈ యాప్‌లను రెండు వైపులా పదును ఉన్న కత్తులుగా పేర్కొన్నారు. ఇవి ముఖ్యమైన కొనుగోళ్లను సులభతరం చేయగలవు, కానీ అవి అనవసరమైన విలాసాలను కొనుగోలు చేసే చెడు అలవాటుకు కూడా దారితీయిస్తుందని అల్ జుబైది అన్నారు.

అబుదాబికి చెందిన అహ్మద్ సలేం మాట్లాడుతూ.. BNPL యాప్‌ల ప్రయోజనాలను గమనిస్తే, ఈ కార్యక్రమం అద్భుతమైనదని అన్నారు. కొనుగోళ్లకు చాలా సహాయపడుతుందని, ప్రత్యేకించి ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించని వారికి మేలన్నారు.  వినియోగదారులు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణతోపాటు ఈ స్కీములోని నియమ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకొని, దానిని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com