ఏపీ: యువతకు గుడ్ న్యూస్..
- March 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఏపీఎస్‌ఎస్‌డీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
ఇందులో భాగంగా ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో యువతక ఐటీ ఆధారిత కంపెనీల్లో ఉపాది అవకాశాలు పెరుగుతాయిని అధికారులు తెలిపారు.
మరోవైపు విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







