రూ.500 కోట్లతో తిరుపతి మోడల్ బస్ స్టేషన్
- March 13, 2025
తిరుపతి: తిరుపతిలో రూ.500కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ (ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పనులను త్వరలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో చేపట్టనున్నట్టు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.ప్రతిపాదిత మోడల్ బస్ స్టేషన్ తాజా స్థితిపై తిరుపతి లోక్ సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి పార్లమెంట్ లో వివరణ కోరారు.
అందుకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ… తిరుపతి ఇంటర్-మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించి బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ డిజైన్‌ను సంబంధిత వర్గాల సూచనలతో మెరుగు పరిచే పనులు జరుగుతున్నాయన్నారు. ప్రయాణికుల రవాణా సౌకర్యం, భద్రత, వేగవంతమైన రాకపోకలకు అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నారని పేర్కొన్నారు.
డిజైన్ సిద్దమైన వెంటనే పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ప్రాజెక్ట్ అమలు చేయనుందని తెలిపారు. ఏడాది క్రితం ఎంపీ గురుమూర్తి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







