"సౌందర్యలహరీ"
- September 02, 2016సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
శక్తిం గూడియె యీశ్వరుండు సృజియించం జాలు లోకంబులన్
శక్తిం బాసిన కాలు,కేలు కదుపన్ సాధ్యంబె యెవ్వానికిన్
శక్తిం గొల్తురు బ్రహ్మ,విష్ణు,హరులున్ సర్వార్థసంసిద్ధికై
శక్తిన్ సన్నుతిసేయుపుణ్యమెడగా సంప్రజ్ఞులెట్లౌదురో?.......... .......1
నీపదరేణువుం బడసి నీరజగర్భుడు సృష్టికర్తయౌ,
నీపదరేణువుం దలలనిల్పును వేయిట విష్ణువాదటన్,
నీపదరేణువున్మెదిపి నేరుపునన్ హరుడంగరాగసం
దీపనసిద్ధినొందు జననీ! నిను వర్ణనసేయనేర్తునే?............. .2
పాపనవిద్య సూర్యఖని, పాపదరిద్రత దేవరత్నమౌ,
బాపజడత్వమున్ పరమభవ్యసచేతన పుష్పసారమౌ,
పాపిభవాబ్ధి మింటనిలుపంగను విష్ణువరాహదంష్ట్రయౌ,
నీ పదపాంసుజాలమది నిక్కమెరింగి వచింపనేర్చినన్!!!.........త్రీ
దేవతలెల్ల హస్తముల దీప్తివహింపగ భద్రముద్రలన్,
నీవుభవత్కరంబులను నిల్పవుముద్రలు నందుకైదగన్,
దేవి! భవత్పదంబులవి నేర్చెనుగా నభయప్రదంబులై,
శ్రీవిలసిల్లి ముఖ్యవరసిద్ధి యొనర్పగ మించి వాంఛలన్!!!..........4
హరి శ్రీచక్రసురూపధారిణిని నిన్నర్చించి స్త్రీరూపియై
పరమాత్మున్ హరునంతవాని మునుముంపంజాలె మోహాంబుధిన్
స్మరుడౌరా! రతికంటికాటుకగుచున్ సన్మౌని హృన్మండలిన్
పరివేధించి విమోహవార్ధిమునుచున్ భవ్యాత్మ! నీసత్కృపన్!!!............5
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!