పాకిస్తాన్ లోని పెషావర్ లో ఉగ్రవాదులు కాల్పులు ఐదుగురు మృతి
- September 02, 2016పాకిస్తాన్ లోని పెషావర్ లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఆఫ్గనిస్తాన్, పాక్ సరిహద్దు ప్రాంతమైన క్రిస్టియన్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సూసైడ్ జాకెట్స్ ధరించారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. ఈ ఘటనపై సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్