ఈ వారంతంలో యూఏఈలో దుమ్ము, వర్షం వుండొచ్చు
- November 24, 2016మనామా: ఈ వారాంతంలో బీచ్ వద్ద ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. వాతావరణ శాఖ భారీ వర్షాలు, అలాగే దుమ్ముతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందనే హెచ్చరికల్ని పంపిస్తోంది. గుఉవారం దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫుజారియా, రస్ అల్ ఖైమా భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ప్రజల బయటకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. దుబాయ్‌లో శుక్రవారం ఉదయం నుంచీ దుమ్ము ధూళితో కూడిన వాతావరణమే కనిపించనుంది. రస్ ఖైమా, సమీప ప్రాంతాలు మాత్రం భారీ వర్షాలతో తడిసి ముద్దవనున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ మరియు సెస్మాలజీ హెచ్చరిస్తోంది. సముద్రంలో కెరటాల తీవ్రత అధికంగా ఉంటుంది గనుక, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరేబియన్ గల్ఫ్‌లో కెరటాలు 8 నుంచి 10 అడుగుల ఎత్తువరకు ఉండొచ్చు. 12 అడుగుల వరకూ పెరిగినా ఆశ్చర్యం కాదు. ఒమన్ సీ మాత్రం పెద్దగా సమస్యలు ఉండవనీ, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…