అధిక బరువు సమస్యకు అనపకాయ వేపుడు
- March 28, 2017మన తోటలో లభించే సొరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సొరకాయ అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలోని చెడు నీటిని టాక్సిన్ల ద్వారా సొరకాయ బయటికి నెట్టేస్తుంది. అలాగే నరాల బలహీనతను దూరం చేస్తుంది. శీతల వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉదర రుగ్మతలను నయం చేస్తుంది. సొరకాయ పిందెలతో అధిక బరువు తగ్గవచ్చు. సొరకాయ పిందెలతో వేపుడు చేసుకుని ఆహారంలో రోజూ చేర్చుకుంటే.. ఒబిసిటీ దూరమవుతుంది.
సొరకాయ పిందెలతో వేపుడు ఎలా చేయాలంటే..? బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో నువ్వుల నూనె పోయాలి. వేడయ్యాక ఆవాలు చేర్చాలి. ఆపై ఉడికించిన సొరకాయ ముక్కల్ని అందులో చేర్చాలి. బాగా వేగాక తగినంత ఉప్పు చేర్చాలి. ఆపై పొడిచేసుకున్న వేరుశెనగ, మిరపకాయ, వెల్లుల్లి మిశ్రమాన్ని అందులో చేర్చాలి. ఈ వేపుడును ఆహారంలో చేర్చుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
సొరకాయను రోజువారీ ఆహాంలో చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరానికి చలవ చేస్తుంది. అయితే సొరకాయను అధికంగా తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్