మేనేజర్ దొరకలేదని మెయిడ్ ని హత్య చేసిన ఆసియా వ్యక్తి
- March 30, 2017దుబాయ్:ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి హత్య నేరంలో నిందితునిగా నిరూపించబడటంతో ముద్దాయిని జైలులో 15 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తు దుబాయ్ క్రిమినల్ న్యాయస్థానం ఆదివారంతీర్పు ఇచ్చింది. ఒక కాపలాదారునిగా పని చేస్తున్న ఆ వ్యక్తి ఒక యువతీ మెడపై పలు కత్తిపోట్లు పొడిచి ఆమె అపార్ట్మెంట్ లో హతమార్చినట్లు కనుగొనబడింది. ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెని చంపడానికి యత్నించలేదని ఆవేశంలో అలా జరిగిపోయినట్లు నిందితుడు అంగీకరించాడు.మేనేజర్ తో తనకు ఉన్న ఆర్థిక వివాదాన్ని పరిష్కరించడానికి అపార్ట్మెంట్ కి వెళ్లెనని చెబుతూ ఆ వ్యక్తి దొరకకపోవడంతో అందుకు బదులుగా ఆ మహిళను పొడిచినట్లు తెలిపాడు. తనను వెలుపల నిలబెట్టి తలుపు వద్ద మాట్లాడుతున్న ఆ మహిళ తనతో వాదన జరిపిందని , దాంతో ఆమె చేతిని తోసుకొని లోపాలకి వెళ్ళి వంటగదిలోని కత్తి తీసుకొని ఆమె మెడపై కత్తిపోట్లు పొడిచెనని కోర్టుకి విన్నవించుకున్నాడు. .నిందితుని 15 ఏళ్ళ శిక్షా కాలం పూర్తైన వెంటనే దేశమునుండి బహిష్కరించాలని దుబాయ్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు