జర్నలిస్ట్‌గా నటించనున్న ప్రముఖ హీరో అర్జున్ కుమార్తె
- April 28, 2017శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షనకింగ్ అర్జున్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కాదలిన్ పొన్ వీధియిల్'. తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు చంద్రన్ హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ చిత్రంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. టైటిల్‌ని బట్టి పక్కా లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోందని భావిస్తున్న సినీ అభిమానులకు షాకిస్తూ... అర్జున్ తన గత చిత్రాల తరహాలోనే దేశభక్తి అంశాన్ని జోడిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్‌కి నచ్చే లవ్ ఎపిసోడ్‌తోపాటు అన్ని వర్గాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా 'కాదలిన్ పొన్ వీధియిల్' రూపొందుతోంది. కథ ప్రకారం ఐశ్వర్య టీవీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం