మన బందరు

వెలుగు జిలుగుల రోల్డు గోల్డుకు
పుట్టినిల్లె బందరు........

కలంకారికి అలంకారము తెచ్చినది
మన బందరు....

విశ్వజగతికి తీపి నేర్పిన లడ్డు,హల్వ
మాదిలె.........

ఆంధ్ర బ్యాంకుకు,ఆదిమూలం..ఆదితాళం
బందరే.....

కడలి వడ్డున ముత్యమల్లె మురిసిపోయె
బందరు......

 పుణ్యమూర్తుల జన్మభూమిగ
పునితమైనది బందరు...

జగతి సిగలొ పుష్పమల్లె,పరిమళించె
బందరు....

ఎన్ని గాధలు,ఎన్ని భాధలు ఓర్చుకుందొ
బందరు...

ఎంత చరితను మూటగట్టి దాచుకుందొ
బందరు.....

Back to Top