ఈద్ అల్ అదా సెలవుల్లో ఆకాశయానం: ఈ జాగ్రత్తలు తీసుకోండి
- August 23, 2017దుబాయ్ కస్టమ్స్ ప్రయాణీకులు తమతోపాటు తీసుకెళ్ళకూడని వస్తువుల వివరాల్ని ప్రత్యేకంగా పేర్కొంది. ఈద్ అల్ అదా సెలవుల సందర్బంగా పెద్దయెత్తున ప్రజలు విమానయానం వైపు మొగ్గు చూపుతారు గనుక, రద్దీ సమస్యలు ఏర్పడతాయనీ, చెకింగ్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాల్ని వెల్లడించారు. 100 మిల్లీ లీటర్లకు మించిన లిక్విడ్‌ని కంటెయినర్లలో తీసుకెళ్ళరాదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హోవర్ బోర్డ్స్, మిని సెగ్వేస్, స్మార్ట్ లేదా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వీల్స్ లాంటి మోటరైజ్డ్ వెహికిల్స్, నిజమైనవి లేదా ఆటబొమ్మల్లాంటి పిస్టల్స్, ఆయుధాలు, ఫైర్ క్రాకర్స్, మెటల్ కట్లెరీ, రేజర్ బ్లేడ్లు, సిజర్స్, నిట్టింగ్ నీడిల్స్ వంటివి విమానాల్లో అనుమతించరు గనుక ప్రయాణీకులు ఈ వస్తువుల్ని తమ బ్యాగేజీలో లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ