దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- May 03, 2024
దుబాయ్: దుబాయ్‌లో కలరా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16న రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం కారణంగా ఎమిరెట్స్ లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యాయని, ఆనంతరం అక్యూట్ డయేరియా ఇన్ఫెక్షన్ గురించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, దుబాయ్‌లో ఎటువంటి కేసులు లేవని అధికారులు తెలిపారు. "కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఛానెల్‌లపై ఆధారపడాలని మేము ప్రజలకు సలహా ఇస్తున్నాము. అన్ని సీజన్లు మరియు వాతావరణ పరిస్థితులలో నివారణ చర్యలను సిఫార్సు చేస్తున్నాము" అని దుబాయ్ మీడియా ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దుబాయ్‌లో వర్షాల కారణంగా నీరు కలుషితమైందన్న పుకార్లను అధికారులు ఖండించారు. ముందుజాగ్రత్తగా, పేరుకుపోయిన వర్షపు నీరు మరియు నిలిచిపోయిన నీటిని తీసి వేయాలని ప్రజలకు సలహా జారీ చేశారు. విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం పొందాలని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సూచించింది.ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ మురుగు కాలువలు మరియు నీటి పారుదల నెట్‌వర్క్‌లు బ్లాక్ అయితే, నివాసితులు వెంటనే 800900లో దుబాయ్ మునిసిపాలిటీ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







