హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- May 03, 2024
రియాద్: రాబోయే హజ్ 2024 వార్షిక తీర్థయాత్ర కోసం సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ నుసుక్ యాత్రికుల కార్డ్‌ను ఆవిష్కరించిది. ది. హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా, ఇండోనేషియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా నుసుక్ కార్డ్‌ని విడుదల చేశారు. హజ్ కోసం అత్యధికంగా (241000 మంది )యాత్రికులను పంపుతున్న ముస్లిం దేశమైన ఇండోనేషియా యాత్రికుల కోసం సేవలను క్రమబద్ధీకరించడానికి తుది సన్నాహాలు చర్చించారు. తీర్థయాత్రను మరింత సులభతరం చేయడానికి, చట్టవిరుద్ధమైన మార్గంలో హజ్ చేసే సందర్భాలను తగ్గించడానికి రాబోయే హజ్ సీజన్ కోసం కార్యాచరణ ప్రక్రియలో భాగంగా నుసుక్ యాత్రికుల కార్డ్ ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్డ్ డిజిటల్ మరియు ఫిజికల్ (ప్రింట్) ఫార్మాట్లలో ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్డ్ ప్రింట్ కాపీ యాత్రికులకు వారి సంబంధిత హజ్ మిషన్లు లేదా హజ్ సర్వీస్ అందించే కంపెనీలు, యాత్రికులు తీర్థయాత్ర చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. సౌదీకి రాకముందే యాత్రికులు కార్డును పొందాలని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..