వినని డైలాగ్స్ తో వస్తున్న 'అర్జున్ రెడ్డి'
- October 08, 2017హైదరాబాద్: చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించిన చిత్రం 'అర్జున్‌రెడ్డి'. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.40 కోట్లు రాబట్టింది. కాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను సెన్సార్ చేశారు. అయితే ఆ డైలాగ్ ఉండే కాపీని విడుదల చేయనున్నట్లు సమాచారం. అమేజాన్ ప్రైం వీడియోస్ అక్టోబరు 13న సెన్సార్ చేయని కాపీని సబ్‌టైటిల్స్‌తో సహా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా నిడివిని కుదించే క్రమంలో అనేక ముఖ్యమైన సన్నివేశాలను తీసేయాల్సి వచ్చిందని ఓ సందర్భంలో హీరో విజయ్ దేవరకొండ తెలిపారు.
విజయ్ దేవరకొండ, షాలిని పాండే ఈ చిత్రంలో జంటగా నటించారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రణయ్‌రెడ్డి వంగా చిత్రాన్ని నిర్మించారు. రధన్ స్వరాలు సమకూర్చారు. ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ