ఫేక్ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌తో తస్మాత్ జాగ్రత్త
- October 12, 2017జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అధికార ప్రతినిథి కల్నల్ తరీక్ అల్ ఆర్బీన్ మాట్లాడుతూ, డ్రైవింగ్ టీచర్లుగా అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు సౌదీ మహిళల్ని వంచిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారికంగా డ్రైవింగ్ నేర్పించే కేంద్రాలను త్వరలో ప్రకటిస్తామనీ, ఈలోగా తొందరపడి అక్రమార్కుల వలలో పడవద్దని ఆయన సూచించడం జరిగింది. ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని కొన్ని ఆఫీసులతోపాటు, మరికొంతమంది మహిళలకు డ్రైవింగ్ నేర్పుతామంటూ ముందుకొస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారాయన. మినిస్టీరియల్ కమిటీ సంబంధిత రెగ్యులేషన్స్ పూర్తి చేయగానే, నెలరోజుల్లోపు అధికారిక ట్రైనింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారాయన. ఎలాంటి అనుమతి లేకుండా ఎవరైనా మహిళలకు డ్రైవింగ్ ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే వారికి కఠినంగా జరీమానాలు విధిస్తామని అల్ అర్బీన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…