Maa Gulf
ఇండికేటర్స్‌ వినియోగించకపోవడం కూడా ఉల్లంఘనే

ఇండికేటర్స్‌ వినియోగించకపోవడం కూడా ఉల్లంఘనే

మస్కట్‌: వాహనదారుడు తన వాహనాన్ని నడుపుతున్న సమయంలో కుడి వైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలనుకుంటే, సంబంధిత ఇండికేటర్స్‌ వినియోగించాలనీ, అలా వినియోగించకపోవడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని రాయలఠ్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడితే 15 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వెళుతూ అకస్మాత్తుగా లేన్లు మారిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయనీ, ఇండికేటర్లను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు దారి తీస్తున్నందున, ఇతర వాహనాలను గౌరవించి వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇండికేటర్స్‌ తప్పనిసరిగా వాడాలనీ, బ్రేక్‌ లైట్‌ సహా వాహనంలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు.