రెండు జన్మల కథతో పూరి తనయుడు నటిస్తున్న 'మెహబూబా'
- October 21, 2017డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. భారత్ పాక్ యుద్ధం కాలంలో చనిపోయిన ప్రేమ జంట తిరిగి ఈ కాలంలో పుట్టటం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరి తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు