డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌

- October 25, 2017 , by Maagulf
డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు: ఒక కప్పు, బాదం - అర కప్పు, నువ్వులు - అరకప్పు, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, కొబ్బరి పొడి - అర కప్పు, తేనె - మిశ్రమాన్ని బాల్స్‌ చేయడానికి తగినంత. 
తయారీ విధానం: ముందుగా బాదం పప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌ రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com