బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..
- November 25, 2017జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. నెయ్యిని ఓ బౌల్లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంపూతో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది.
గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని 20 నిమిషాల పాటు వుంచాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం వుంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు.
అలాగే నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. మూడు చెంచాల నెయ్యిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వెంట్రులకు రాసుకుని అరగంట పాటు వుంచి.. ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి. బట్టతల నుంచి తప్పించుకోవాలంటే.. మాసానికి ఓసారి నెయ్యిని కురులకు పట్టించడం చేయాలి.
ఐదు స్పూన్ల నెయ్యికి పది బాదం పలుకులు కలిపి వేడి చేసి అవి నలుపుగా మారాక వాటిని నెయ్యి నుంచి తొలగించాలి. ఆ నూనెను మాడుకు పట్టించాలి. మూడు గంటలకు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్ షాంపును ఉపయోగించడం మరువకూడదు. ఇలా చేస్తే బట్టతల సమస్యను దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..