బాలికపై వేధింపులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ వర్కర్‌కి జైలు
- December 09, 2017దుబాయ్:19 ఏళ్ళ బాలికప లైంగిక దాడికి యత్నించేందుకు ప్రయత్నించిన 27 ఏళ్ళ దుబాయ్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ వర్కర్‌కి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జనవరిలో బ్రిటిష్ హాలీడే మేకర్ అయిన 19 ఏళ్ళ బాలిక దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాను వెళ్ళాల్సిన విమానం కోసం ఎదురుచూస్తుండగా, 27 ఏళ్ళ ఆసియాకి చెందిన వ్యక్తి ఒకరు ఆమెను గుర్తించి, ఆమెకు కాఫీ ఆఫర్ చేశాడు. విమానం ఆలస్యమవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ వర్కర్, ఆమెను హోటల్ రూమ్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె రెస్ట్ తీసుకుంటున్న సమయంలో హెయిర్‌ని టచ్ చేశాడు. ఆ తర్వాత ఆమె మోకాలి భాగాన్ని టచ్ చేశాడా వ్యక్తి. ఆమె ఆగ్రహంతో ఊగిపోవడంతో, నిందితుడు ఆమెకు అక్కడే క్షమాపణ చెప్పాడు. అయితే ఆమె బయటకు వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్ట్ చేయనున్నారు. విచారణలో నిందితుడు, ఆమెను నిద్ర లేపేందుకే టచ్ చేసినట్లు చెప్పాడు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి