రోజుకో ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటే మంచిది
- December 09, 2017కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం, శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు వుంటాయి. ఇవి శరీరానికి అందడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవు. రోజుకో కోడిగుడ్డును తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లను అప్పుడే తినేయడం మంచిది. గంటల పాటు బాక్సుల్లో వుంచి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి. కనుక ఉడికిన గుడ్డును 3 గంటల్లోపే తినేయడం మంచిది. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో నిల్వ వుంచకూడదు.
ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఒబిసిటీ వున్నవారు తెల్లసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటరని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం