చట్టవిరుద్ధంగా బహ్రెయిన్ లో ప్రవేశించడానికి పాత్రికేయుని ప్రయత్నం : నివేదిక
- December 09, 2017
మనామ : మీడియా ఎప్పుడూ స్వయంనియంత్రణ విధించుకోవాలి...చట్టాలను గౌరవించి.. హుందాతనమనే లక్ష్మణ రేఖనే ఎన్నడూ దాటకూడదు. అటువంటి ముఖ్య విషయాన్నే విస్మరించిన ఓ జర్నలిస్ట్ పొరుగు దేశ సరిహద్దు లోనికి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడని మంత్రిత్వ శాఖకు బహెరిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కతర్ అల్ జజీరా ఛానల్ కు సంబంధించిన ఒక పాత్రికేయుడు ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటికి వ్యవహరిస్తున్న అమెరికా దేశ ప్రతినిధి.ఇజ్రాయెల్ దేశంలోని టెల్ అవివ్ నివాసి అయిన జర్నలిస్ట్ అని సమాచార వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఒక అధికారిక వనరును ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఆ జర్నలిస్ట్ ను అధికారికంగా ఆహ్వానం పంపకపోయినప్పటికీ ఈ వివాదాస్పద పాత్రికేయుడు మీడియా వీసా ద్వారా విధులను నిర్వర్తించే ఒక బాధ్యత కల్గిన పాత్రికేయుడి మాదిరిగా బహ్రెయిన్ రాజ్యంలోకి ప్రవేశించడంపై కప్పిపుచ్చుకునేందుకు పేర్కొన్నాడని బహెరిన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో బహ్రెయిన్ లో ఆ జర్నలిస్ట్ ప్రవేశాన్ని మంత్రిత్వశాఖ నిషేధించింది. "కతర్ ఛానల్ ఈ పునరావృత మరియు బాధ్యతా రహితమైన ప్రవర్తన యొక్క ప్రయోజనాల గురించి సమాచార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిగా తెలుసుకుంటుంది. అవాస్తవ ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించి, సరికాని సమాచారం అందజేయకండని 'అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. బహ్రెయిన్ లో జరిగిన సంఘటనలు మరియు కార్యక్రమాలను కతర్ అల్ జజీరా ఛానల్ ప్రసారం చేయాలని ఆశించినపుడు మా దేశానికి చెందిన చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మీడియా విధిగా పాటించాలని సమాచార వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. " బహెరిన్ రాజ్యంలో జరిగే వివిధ కార్యకలాపాలను ప్రసారం చేయడానికి అన్ని మీడియాలను సమాచార వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాగతించింది, అయితే ఆయా ప్రతినిధులు వారు బహ్రెయిన్ లో ప్రసార మాధ్యమానికి సంబంధించిన చట్టాలు మరియు నిబంధనల ప్రకారం కట్టుబడి వుండాలని తెలిపింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







