వెజిటబుల్ పాపడ్ రోల్స్
- December 13, 2017కావలసిన పదార్థాలు: మినప్పప్పు అప్పడాలు - 8, క్యారెట్ - ఒకటి, బంగాళదుంప - ఒకటి, ఫ్రెంచ్ బీన్స్ - ఆరు, క్యాలీఫ్లవర్ - వంద గ్రాములు, టొమాటో - ఒకటి, పసుపు - అర చెంచా, కారం - అర చెంచా, కొత్తిమీర - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా క్యారెట్, బంగాళదుంప, ఫ్రెంచ్ బీన్స్, క్యాలీఫ్లవర్‌లను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వీటన్నింటినీ ఓ పాత్రలో వేసి అందులో కాసింత ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. తరువాత అందులో నీటిని వడబోసి ముక్కలను ఆరబెట్టాలి. ఓ పాత్రలో కాసింత నూనె వేసి టొమాటోను దోరగా వేయించాలి. ఇప్పుడు అందులో ఉడకబెట్టిన కూరగాయ ముక్కలను వేసి మరికొంతసేపు వేయించాలి. అందులో పసుపు, కారం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి పొయ్యిమీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. అప్పడాలను ముందుగా కాసేపు నీటిలో ముంచి తీయాలి. దీనివల్ల అవి విరిగిపోకుండా ఉంటాయి. మెత్తబడిన అప్పడం మధ్యలో సిద్ధంగా ఉన్న కూరగాయల మిశ్రమాన్ని వేసి దోశలాగా చుట్టుకొని చివర్లు మూసివేయాలి. ఓ బాణలిలో తగినంత నూనె వేసి అది బాగా వేడెక్కాక అప్పడాలు వేసి దోరగా వేయించాలి. అంతే- వెజిటబుల్ పాపడ్ రోల్స్ రెడీ! వీటిని వేడిగా ఉన్నప్పుడే తింటే మరింత రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..