ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- May 21, 2024
అమరావతి: పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని, ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నామని పేర్కొంది.
ప్రభుత్వం సుమారు రూ.1,500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం రూ.50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. రూ.530 కోట్ల బిల్లులను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటివరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







