పల్లీలు గుండెకు మేలు.!
- December 13, 2017
పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది తదితర అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అవి కేవలం అపోహలు మాత్రమేననీ, పల్లీలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి అంటున్నారు పరిశోధకులు. మధ్యాహ్నం భోజనంతో పాటు కొన్ని పల్లీలు నేరుగా లేదా షేక్ రూపంలో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. పదహారు మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపువారికి మధ్యాహ్నం భోజనం తరువాత గుప్పెడు పల్లీలు ఇచ్చారు. రెండో గ్రూపు వారికి సాధారణ డ్రింక్‌ను ఇచ్చారు కొన్ని గంటల అనంతరం వీరిని పరీక్షించగా, పల్లీలు తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గిన విషయాన్ని గుర్తించారు. మామూలుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పల్లీలు తినడం వలన వీటి స్థాయి పెరగకుండా తగ్గడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కెర వ్యాధిగ్రస్తులు పల్లీలు తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసకోవడం తప్పనిసరి అని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







