జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్‌ఎం సుల్తాన్
- May 21, 2024
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ జోర్డాన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మే 22 నుండి జోర్డాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, రెండు దేశాలకు కావలసిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని తెలిపింది. హిజ్ మెజెస్టి ది సుల్తాన్, జోర్డానియన్ చక్రవర్తి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకోనున్నారు. అరబ్ జాయింట్ యాక్షన్‌కు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో సుల్తాన్‌తో పాటు, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్, సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, మంత్రి సయ్యద్ బిలారబ్ బిన్ హైతామ్ అల్ సయీద్‌తో కూడిన ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం కూడా వెళుతుంది.
తాజా వార్తలు
- లోక్‌సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







