హైదరాబాద్ లో వ్యభిచార ముఠా, పట్టుబడ్డ హీరోయిన్లు
- December 16, 2017హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయింది. సెలబ్రిటీ స్టేటస్ మాటున హోటళ్లకు వస్తూ వారు చేస్తున్న నిర్వాకాన్ని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. శనివారం నగరంలోని తాజ్ డెక్కన్, తాజ్ బంజారా హోటళ్లలో పోలీసులసు దాడులు చేయగా ఇద్దరు బాలీవుడు నటీమణులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు శుక్రవారం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బడా వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని వీరు ఈ హైటెక్ వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం.
అరెస్టయిన వారిలో బాలీవుడ్ నటి రీచా సక్సేనా, బెంగాలీ నటి శుభ్రచటర్జీ (బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తోంది), నిర్వాహకుడు మోనిక్లు ఉన్నారు. వీరిలో ఒక నటి తాజ్ డెక్కన్‌లో, మరో నటి తాజ్ బంజారాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. విటుల రూపంలో వెళ్లి వీరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారి అయిన జనార్ధన్ అలియాస్ జానీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం