ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ ఆధ్వర్యంలో 'క్లీన్ అప్ యూఏఈ'
- December 16, 2017
యూఏఈ : పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలు శనివారం ఉదయం ఒక సామూహిక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. " యూఏఈ ను శుభ్రం చేద్దాం " పేరిట వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా ఈ మహోన్నత సేవా కార్యక్రమాన్ని ఏమిరాటిస్ పర్యావరణ సమూహం ( ఏమిరాటిస్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ ) ద్వారా నిర్వహించబడింది పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నుండి వేలమంది ప్రజలతో పాటు దేవా , ఎం.సి. డోనాల్డ్, అల్ ఘుర్ర్ర్ మరియు మిలీనియం హోటల్ దుబాయ్ మొదలైన సంస్థలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే , పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలు మొదలైన వ్యర్ధాలను తొలగించి శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎడారి దుబాయ్ అలీన్ రహదారి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రమైన యూఏఈ కోసం ఉత్సాహంగా జరిగిన ఈ సామాజిక స్వచ్చంద కార్యక్రమంలో ఎడారి నుండి ఎన్నో సేకరించిన వ్యర్థాలు ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సేవకులకు పండ్లు నీరు మరియు అల్పాహారం నిర్వాహుకులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







