Indian consulate to set up nine welfare committees
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
9 వెల్ఫేర్‌ కమిటీల్ని ఏర్పాటు చేయనున్న ఇండియన్‌ కాన్సులేట్‌

9 వెల్ఫేర్‌ కమిటీల్ని ఏర్పాటు చేయనున్న ఇండియన్‌ కాన్సులేట్‌

దుబాయ్‌: సమస్యలతో సతమతమవుతున్న ఇండియన్స్‌ కోసం ఇండియన్‌ కాన్సులేట్‌, కమ్యూనిటీ మెంబర్స్‌ పలు కమిటీలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌, కమ్యూనిటీ మెంబర్స్‌తో కలిసి ఈ తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయనుంది. సమస్యలతో సతమతమవుతున్న భారతీయులకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయని దుబాయ్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ చెప్పారు. 16వ ప్రవాసీ భారతీయ దివస్‌ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారాయన. సీ ఫేర్స్‌, జైలు, లీగల్‌, కల్చరల్‌, స్టూడెంట్స్‌, మెడికల్‌, ఇల్లీగల్‌ స్టే / ఇమ్మిగ్రేషన్‌, డెత్‌ కేసెస్‌, ఫ్యామిలీ డిస్‌ప్యూట్స్‌ / వివాహ సంబంధ వివాదాలను హ్యాండిల్‌ చేయడానికి వీలుగా ఈ కమిటీల్ని రూపకల్పన చేస్తారు. కాన్సులేట్‌కి అసిస్ట్‌ చేస్తున్న వాలంటీర్లు, కమ్యూనిటీ లీడర్లు, కాన్సులర్‌ అధికారుతో కలిసి ఈ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలలకోసారి ఓపెన్‌ మీటింగ్స్‌ని ఇండియన్‌ కమ్యూనిటీతో కలిసి నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. 2017లో కాన్సులేట్‌ పలు వెల్ఫేర్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించింది. 403 ఎయిర్‌ టిక్కెట్స్‌ జారీ చేయగా, 39 మోర్టల్‌ రిమెయిన్స్‌ రీపాట్రియేట్‌ చేశారు. 300 మంది కార్మికులకు సబ్సిస్టెన్స్‌ అలవెన్స్‌ అందించారు. 50 మందికి సంబంధించిన జరీమానాలను చెల్లించడం జరిగింది. 1,100 లేబర్‌ పిర్యాదుల్ని హ్యాండిల్‌ చేయగా, 86 హాస్పిటల్‌ కేసుల్ని అసిస్ట్‌ చేశారు. 230 మంది సెయిలర్స్‌ని రీపాట్రియేట్‌ చేయడం కూడా జరిగింది.