బంగాళాదుంప లాలీపాప్
- January 17, 2018
కావల్సినవి: ఉడికించిన బంగాళాదుంప - ఒకటిన్నర కప్పు, బ్రెడ్‌పొడి - అరకప్పు, ఉల్లిపాయముక్కలు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, కారం - పావుచెంచా, ధనియాలపొడి - చెంచా, నిమ్మరసం - అరచెంచా, ఉప్పు - తగినంత. మైదా - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేయించేందుకు సరిపడా, ఐస్‌క్రీం పుల్లలు - కొన్ని,
తయారీ: ఓ గిన్నెలో మైదా, కాసిని నీళ్లూ తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంప తురుమూ, ఉల్లిపాయ ముక్కలూ, కొత్తిమీర తరుగూ, సగం బ్రెడ్పొడీ, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ధనియాలపొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేయాలి. అన్నింటినీ బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఒక బంగాళాదుంప ఉండను ఐస్‌క్రీం పుల్లకు అద్ది, లాలీపాప్ ఆకృతిలో వచ్చేలా చేసి ముందు మైదా మిశ్రమంలో, తరువాత మిగిలిన బ్రెడ్‌పొడిలో అద్దాలి. ఇలా మిగిలినవీ చేసుకుని రెండుచొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!