గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!

- January 24, 2018 , by Maagulf
గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ప‌వ‌ర్‌ఫుల్ చిట్కాలు..!

అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారా..? అయితే ఇంగ్లిష్ మందులు అవ‌స‌రం లేదు. ఆయా స‌మ‌స్య‌ల‌కు మీ ఇంట్లోనే చక్క‌ని ప‌రిష్కారం ఉంది. ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఆయా సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం

అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా, త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
నీరు

నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.
లవంగాలు

భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2, 3 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.
తులసి ఆకులు

జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తింటే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.
సోంపు

అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
పెరుగు

కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది.

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com