నెల క్రితం తప్పిపోయిన యువతుల ఆచూకీ లభ్యం
- February 09, 2018కువైట్:ఒక నెల క్రితం వారి కుటుంబాల నుంచి పారిపోయినట్లుగా పిర్యాదు చేయబడిన కువైట్ దేశస్థులు కాని ఇరువురు సోదరీమణుల ఆచూకీ అనూహ్యంగా లభ్యమైంది. వీరిని రాజధాని అపరాధ పరిశోధకులు గురువారం అరెస్టు చేశారు. రాత్రిపూట ఆలస్యంగా నగరంలో సంచరిస్తూ పోలీసులకు వీరిద్దరూ ఎదురుపడ్డారు. వీరి కదలికలపై అనుమానం కల్గి పోలీసులు గుర్తింపు కార్డుల గూర్చి అడగ్గా అటువంటివి తమ వద్ద లేవని వారు స్పష్టం చేశారు.సెక్యూరిటీ వర్గాలు వారి వేలిముద్రలు తనిఖీ చేసినపుడు డిటెక్టివ్ లు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తించారు. వారు జహ్రా లోని తమ కుటుంబంను వదిలి పారిపోయిన సోదరీమణులని నివేదించబడింది. తదుపరి పరిశోధనలు నిమిత్తం ఆ ఇద్దరినీ వహా పోలీసు స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు