రివ్యూ: గాయత్రి

- February 09, 2018 , by Maagulf
రివ్యూ: గాయత్రి

నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, అనసూయ నిఖిల విమల్ తదితరులు 

బ్యానర్‌: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ 
సంగీతం    : థమన్ 
నిర్మాత    :  మంచు మోహన్ బాబు 
దర్శకత్వం    : మదన్ 
విడుదల తేదీ: 9 ఫిబ్రవరి 2018 


సినిమా అనే వేదికపై డైలాగ్ తో పాపులర్ అయిన అతి తక్కువ మంది నటులలో మోహన్ బాబు ముందుంటారు.  నటుడిగా అతను చేసి మెప్పించని పాత్రలేదు.. అన్ని రకాల పాత్రలలో భేష్ అనిపించుకున్న పరిపూర్ణ నటుడు మోహన్ బాబు. కొంత గ్యాప్ తర్వాత గాయత్రి తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గాయత్రి  ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం..

కథ:
శివాజీ రంగస్థల నటుడు.. పౌరాణిక, సాంఘీక పాత్రల వేసి మెప్పించడంలో దిట్ట. శారదా సదనం పేరుతో ఒక అనాథ ఆశ్రమం నడుపుతుంటాడు. నెలల బిడ్డగా దూరం అయిన తన కూతురు కోసం వెతుకుతుంటాడు. గాయత్రి ఒక అనాథ. మెడికల్ స్టూడెంట్ అయిన ఆమెను కొందరు చంపాలని ప్రయత్నిస్తుంటారు. ఒకసారి గాయత్రి పై కొందరు దాడి చేయబోతే శివాజీ కాపాడతాడు. తర్వాత గాయత్రినే తన కూతరు అని తెలుసుకుంటాడు శివాజీ. అయితే గాయత్రి తన తండ్రి పై ద్వేషం తో పెరుగుతుంది. అయితే చిన్నతనంలో గాయత్రి ని ఎందుకు శివాజీ దూరం చేసుకుంటాడు..? గాయత్రిని చంపాలని ప్రయత్నిస్తున్నది ఎవరు..? గాయత్రి తన తండ్రిని ఎలా చేరుకుంటుంది అనేది మిగిలిన కథ..?

కథనం:
నటనలో మోహన్ బాబు స్థాయిని గుర్తు చేసిన సినిమా గాయత్రి. శివాజీ గా సెంటిమెంట్ ని పండిస్తూనే, గాయత్రి పటేల్ గా గర్జించాడు. ఈ రెండు విభిన్నమైన పాత్రలను పండించడంలో మోహన్ బాబు పూర్తిగా విజయవంతం అయ్యాడు. చిన్నతనంలోనే దూరం అయిన తన బిడ్డ కోసం ఆరాట పడే తండ్రిగా మోహన్ బాబు నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర ఎలా ఉండాలో అలా మెలిగాడు. సుప్రీత్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం బాగుంది.. ‘‘ మీరంటే భయం నటిస్తాను, వినయం నటిస్తాను, గౌరవం నటిస్తాను’’ అనే సీన్ బాగుంది. మోహన్ బాబు స్టైయిల్ లో ఆ సన్నివేశం నడిపాడు దర్శకుడు మదన్. క్రమశిక్షణే ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటుంది అనే డైలాగ్స్ అతని ఇమేజ్ ని ఎలివేట్ చేసాయి. సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా తండ్రి కూతళ్ళు ఎలా కలుస్తారనే సస్పెన్స్ తో నడిపాడు దర్శకుడు. ఆ సందర్భంలో వచ్చే అంబులెన్స్ సీన్ కాస్త టెన్షన్ ని బిల్డప్ చేసింది. ఆర్టిస్ట్ లకు తెలియని విషయం ప్రేక్షకులకు చెప్పి.. వారికి తెలిసినప్పుడు.. తెలుస్తుదన్నప్పుడు కలిగే ఉత్కంఠను ప్రేక్షకులకు కలిగించడంలో మదన్ సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్ లో కథనం వేగం అందుకుంది. అసలు తన తండ్రి ఎవరో తెలుసుకునే సన్నివేశం నుండి కథ లోకి విష్ణు ఎంటరవుతాడు. యంగ్ ఏజ్ లో మోహన్ బాబు పాత్రను చేసిన విష్ణు సెంటిమెంట్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. శ్రియ శారద పాత్రను చాలా అలవోకగా చేసింది. ఇక గాయత్రి పటేల్ గా మోహన్ బాబు నటన చాలా స్టైలిష్ గా ఉంది. డైలాగ్ తో అవతల వాళ్ళను కట్టిపడేయడం, కంటి చూపుతో కనికట్టు చేసినట్లు నటించడం తెలిసిన మోహన్ బాబు గాయత్రి పటేల్ గా విశ్వరూపం చూపించాడు. నటనలో ఆయన కున్న అనుభవం భాషపై అతనికున్న పట్టు మరోసారి తెలిసింది. కథానాయకుడు, ప్రతి కథానాయకుడు పాత్రలలో మోహన్ బాబు నటన పోటీ పడింది. అతనితో అతనికే పోటీ అనే విధంగా నటించాడు. ఇక కథనంలో మెయిన్ ట్విస్ట్ మొదలయ్యాక గాయత్రి మరింత ఆసక్తికరంగా మారింది. తండ్రీ కూతుళ్ళ మద్య సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన  సినిమాలు చూసిన వారికి కూడా గాయత్రి ప్రత్యేకంగా నిలుస్తుంది. నిఖిల విమల్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రిపోర్టర్ గా నటించిన అనసూయ తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేస్తూ... రిపోర్టర్ ను ఎలివేట్ చేసింది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఇంప్రెసివ్ గా లేదు. ఇక మోహన్ బాబు పేల్చిన పొలిటికల్ సెటైర్స్ అతని రాజకీయ ప్రస్థానం ఎటు వైపు వెళుతుంది అనే ప్రశ్నలకు సమాధానం చెబుతాయి. 


చివరిగా:
మోహాన్ బాబు ఒన్ మాన్ షో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com