తప్పిపోయిన భారతీయుడికోసం బహ్రెయిన్‌లో కొనసాగుతున్న 'సెర్చ్'
- February 13, 2018మనామా: 60 ఏళ్ళ భారత జాతీయుడొకరు గడచిన వారం రోజులుగా తప్పిపోవడంతో అతన్ని కనుగొనేందుకు 'సెర్చ్' ఆపరేషన్ కొనసాగుతోంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్న తిలకన్ ఒండాయంకరన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. తాము నడుపుతోన్న అకాడమీలో తిలకన్ ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్నారనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని ఇండియన్ టాలలెంట్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ లతీష్ భరతన్ చెప్పారు. ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటల సమయంలో మనామా మార్కెట్‌కి బస్‌లో వెళ్ళారనీ, స్టూడెంట్స్ కోసం జెర్సీలు కొనేందుకు వెళ్ళిన ఆయనతో ఉదయం 10.30 గంటల సమయంలో మాట్లాడననీ, ఆ తర్వాత 11 గంటల నుంచి అతని ఫోన్ స్విచాఫ్ వస్తోందని చెప్పారు భరతన్. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, ఎంబసీ సాయాన్ని కూడా కోరినట్లు ఆయన వివరించారు. గత 30 ఏళ్ళుగా తిలకన్‌తో తనకు స్నేహం ఉందని చెప్పారాయన. తిలకన్ కుమారుడు సైతం తన తండ్రి ఆచూకీ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి దొరకడంలేదని చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం