గోంగూరతో మీల్మేకర్
- February 15, 2018కావలసిన పదార్థాలు: మీల్మేకర్ -100 గ్రా., గోంగూర - 2 కట్టలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 2, వెల్లుల్లి - 6 రేకలు, జీలకర్ర - అర టీ స్పూను, కారం - 1 టీస్పూను, పసుపు - చిటికెడు, నూనె - 1 టేబుల్ స్పూను, వేగించిన నువ్వుల పొడి - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్మేకర్ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేగించి మీల్మేకర్ కలపాలి. 5 నిమిషాల తర్వాత (సన్నగా తరిగిన) గోంగూర వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు చల్లి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి దించెయ్యాలి. ఈ కూర అన్నంతో కలుపుకుంటే మటన్ గోంగూర తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!