సప్తగిరికోసం కథను రాస్తున్న 'బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌

- February 15, 2018 , by Maagulf
సప్తగిరికోసం కథను రాస్తున్న 'బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్‌

'బాహుబలి, భజరంగీ భారు జాన్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు కథలందించి దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్‌. రాజమౌళి చేసిన దాదాపు అన్ని సినిమాలకు ఈయనే కథల్ని అందించారు. ఈమధ్య పాపులర్‌ రచయిత రాజమౌళి చేసే సినిమాలకు మాత్రమే కాకుండా బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ రైటర్‌ కమెడియన్‌ నుండి హీరోగా మారిన సప్తగిరి తర్వాత సినిమాకు స్టోరి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com