ఫెడరర్ ఖాతాలో 97వ టైటిల్
- February 18, 2018నెదర్లాండ్స్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో అతను మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు.
55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. సోమ వారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న ఫెడరర్ తాజా విజయంతో అతని ర్యాంక్ నాలుగు వారాలపాటు పదిలంగా ఉంటుంది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ