క్లైమాక్స్ దశలో సాక్ష్యం
- February 18, 2018
బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ భారీగా నిర్మించిన సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ.ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలచేసిన పోస్టర్‌కు విశేషమైన స్పందన లభించిందని చెప్పారు. మే 11న సినిమాను విడుదల చేయనున్నామని అన్నారు. ఇంతవరకు రామోజీ ఫిలింసిటీ, పొల్లాచ్చి, వారణాసి, హౌస్‌పేట తదితర లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని చెప్పారు. ఈ సినిమాలో ఫైట్స్ సీక్వెన్స్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ ఈ చిత్రంలో సరికొత్తగా ఉంటుందని అన్నారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హీరో చేసే సాహసోపేతమైన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. ఫిలింసిటీలో షెడ్యూల్ అనంతరం మరో భారీ షెడ్యూల్‌ను అమెరికాలో జరపనున్నారు. దుబాయ్ లో జరిగిన షెడ్యూల్ కు సహాయ సహకారాలు దేవా మరియు నిఖిల్ పర్యవేక్షించారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్‌రానా, పవిత్రలోకేష్, వెన్నెల కిషోర్, మధు గురుస్వామి, లావణ్య తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: హర్షవర్ధన్, కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







