మెటల్ నట్‌లో ఇరుక్కున్న బాలుడి వేలు
- February 22, 2018రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ టీమ్, అత్యంత చాకచక్యంగా 13 ఏళ్ళ చిన్నారి వేలిని కాపాడింది. మెటల్ నట్‌లో ఇరుక్కుపోయిన ఆ చిన్నారి వేలిని ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షించగలిగారు రెస్యూ టీమ్. బుధవారం రాత్రి ఆ బాలుడ్ని అతని బంధువులు తీసుకొచ్చారనీ, ఫైర్ ఫైటర్స్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, ఆ బాలుడ్ని రక్షించారని యూఏఈ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి చెప్పారు. ముందుగా వారు ఓ ఆసుపత్రికి తరలించగా, సివిల్ డిఫెన్స్ వద్దకు వెళ్ళమని ఆసుపత్రి సిబ్బంది సూచించినట్లు ఆయన వివరించారు. ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్, అలాగే ట్రైనింగ్ అవసరమని వివరించారాయన. ఎలక్ట్రానిక్ కట్టర్ని వినియోగించి మెటల్నట్ని కత్తిరించి, చిన్నారి వేలిని కాపాడారు. ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?