కోజి వర్దరైచకరి
- March 03, 2018కావాల్సిన పదార్థాలు: చికెన్ - ఒక కిలో, కొబ్బరి తురుము - అర కప్పు, కరివేపాకు - ఒక రెబ్బ, మిరియాలు - ఐదు గ్రాములు, గరం మసాలా - ఒక టీ స్పూను, సోంపు - ఒక టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కొబ్బరినూనె - 100 గ్రాములు, పచ్చిమిరపకాయలు - ఆరు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట.
తయారీ విధానం: చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కొబ్బరినూనె పోసి వేడెక్కాక కొద్దిగా కొబ్బరి తురుము, మిరియాలు, కరివేపాకు వేసి ఎర్రగా వేగించాలి. కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక దీన్ని ముద్దగా రుబ్బుకోవాలి. ఇందులో గరంమసాలా, సోంపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి మళ్లీ వేగించాలి. చికెన్ వేసి ఎర్రగా వేగాక ఉప్పు, మిగిలిన కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు