9న మార్చి'ఏం మంత్రం వేశావే' విడుదల కానుంది:శివ కుమార్
- March 03, 2018
హైదరాబాద్:విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఏ మంత్రం వేశావే. శివానీ సింగ్ నాయికగా నటించింది. గోలీసోడా ఫిలింస్ పతాకంపై శ్రీధర్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏ మంత్రం వేశావే చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ..నేడు ప్రపంచమంతా అరచేతిలోని ఫోన్‌లోకి వచ్చేసింది. ఇలాంటి సమయంలో యువత ఎక్కువగా ఆన్‌లైన్ గేమింగ్‌లకు అలవాటు పడుతున్నారు. వాస్తవంగా తమ చుట్టూ ఇంటిలో, సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించలేకపోతున్నారు. చివరకు అన్ని రకాలుగా భవిష్యత్‌నూ కోల్పోతున్నారు. ఇలాంటి ఓ యువకుడిని అతనికి పరిచయమైన యువతి ఎలా మార్చింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత బాగా చూపించింది అనేది కథాంశం. మూస చిత్రాలకు భిన్నమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. పిల్లలు పెద్దలకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.తెలుగులో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ప్రేక్షకుల్లో స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నారు. ఏ మంత్రం వేశావే పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ నెల 9న ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాం. అత్యధిక థియేటర్‌లలో విడుదల చేస్తున్నాం. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల అండతోనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్‌లు దురాశకు పోతున్నారు. చిన్న నిర్మాతలకు నష్టాలు తీసుకొస్తున్నారు. అన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!