'ఎంఎల్ఏ' సాంగ్ విడుదల
- March 13, 2018నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఎంఎల్ఏ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రం చేస్తున్నాడు. మార్చి 23న మూవీ విడుదలకి ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరచిన రెండో సాంగ్‌ని తాజాగా విడుదల చేశారు. హే ఇందూ అనే సాంగ్ సంగీత ప్రియులని అలరిస్తుంది. కరసాల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇచ్చిన కాజల్ ఎంఎల్ఏ చిత్రం ద్వారా కళ్యాణ్ సరసన రెండో సారి జతకట్టింది. సి భరత్ చౌదరి, ఎంవి కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందినట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం