అలనాటి హీరోయిన్ హాస్పిటల్ బెడ్‌పై దీనావస్థలో..
- March 20, 2018వెండి తెరపై వెలుగులు.. తారల తళుకులు.. అభిమానుల మెచ్చుకోలు.. ఫామ్‌లో ఉన్నప్పుడే ఫేమ్ సంపాదించుకోవాలనే తాపత్రయం.. పగలూ రాత్రీ షూటింగులు.. కోరిన నిర్మాతలకు కాల్షీట్లు.. ఇదీ హీరోయిన్ల జీవితం అనుకుంటాం. కానీ నాలుగు సినిమాలు చేతిలో ఉన్నప్పుడే వారి జీవితాలు బావుంటాయి. సినిమాలు లేకపోతే సామాన్యులు పడే కష్టాలే వారినీ పలకరిస్తాయి. బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి 'వీర్గతి'లో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన పూజా దద్వార్ అనారోగ్యంతో మంచం పట్టి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.
ఆమె పలు హిందీ చిత్రాలు హిందూస్తాన్, సింధూర్ సౌగంధ్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆరు నెలల క్రితం వచ్చిన టీబీ ఆమెను కృంగ దీస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. కుటుంబ సభ్యులు ముంబైలోని శివ్‌ది ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్లి పోయారు. ఆఖరికి కట్టుకున్న భర్త కూడా కనికరం లేకుండా ఆమెను ఆ పరిస్థితుల్లో వదిలేసి వెళ్లి పోయాడు. టీ తాగడానికి కూడా డబ్బుల్లేవంటూ వాపోతుంది. మీడియాకు తన దీనస్థితిని వెల్లడించింది. సల్మాన్ ఖాన్ సాయం చేస్తాడేమోనని ఎదురు చూస్తోంది. ఉన్న ఆస్తినంతా కుటుంబ సభ్యులు తీసేసుకున్నారని.. ఆఖరికి మెరుగైన చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితి తలెత్తిందని వాపోతోంది. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..