41 మంది మహిళల్ని హైర్ చేసుకున్న మక్కా హోటల్
- March 21, 2018మక్కా: మక్కాలోని ఓ ప్రముఖ హోటల్ 41 మంది సౌదీ మహిళల్ని రిసెప్షన్, బుకింగ్స్, అడ్మినిస్ట్రేషన్, కిచెన్ విభాగాలకుగాను హైర్ చేసుకుంది. అబీర్ అల్ హర్బి అనే మహిళ మాట్లాడుతూ, తాను ఫుడ్ ప్రిపరేషన్ విభాగంలో అవకాశం దక్కించుకున్నాననీ, ఈ పని తనకు చాలా ఆనందాన్నిస్తోందని చెప్పింది. రిసెప్షనిస్ట్ సారా నజ్జర్ మాట్లాడుతూ, వర్క్ ప్లేస్ చాలా బాగుందనీ, చాలా నేర్చుకుంటున్నాననీ చెప్పింది. వివిధ దేశాలకు చెందినవారు హోటల్‌కి వస్తుంటారనీ, వారితో మాట్లాడటం వల్ల ఆయా భాషల్ని తెలుసుకోగలుగుతున్నానని ఆమె వివరించింది. మరో రిసెప్షనిస్ట్ రీమ బకత్యాన్ మాట్లాడుతూ, కొత్త బాధ్యతలు తనలో ఆత్మవిశ్వాసం పెంచినట్లు పేర్కొంది. కాల్ సెంటర్ ఎంప్లాయీ అరా బుకారి మాట్లాడుతూ, హోటల్ లోని గెస్ట్‌ల నుంచి రెగ్యులర్‌గా వచ్చే ఫోన్ కాల్స్‌ని రివీస్ చేసుకుని, వారికి తగిన సమాచారం అందిస్తున్నట్లు చెప్పింది. మెడికల్ ఇన్సూరెన్స్ కోఆర్డినేర్ అఫాఫ్ అబ్దుల్లా మాట్లాడుతూ జీవితంల ఉన్నత శిఖరాల్ని అధిరోహించేందుకు ఇదొక అరుదైన అవకాశమని వెల్లడించింది. జనరల మేనేజర్ ఫవాన బయోమి మాట్లాడుతూ మహిళా అభ్యర్థులకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!